Powered by

Home DNPA Media Centre

DNPA ఛైర్మన్‌గా తన్మయ్‌ మహేశ్వరి నియామకం

డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ (డీఎన్‌పీఏ) ఛైర్మన్‌గా అమర్‌ ఉజాలా పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ తన్మయ్‌ మహేశ్వరి ....

By DNPA Team
New Update
dw

దిల్లీ: డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ (డీఎన్‌పీఏ) ఛైర్మన్‌గా అమర్‌ ఉజాలా పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ తన్మయ్‌ మహేశ్వరి నియమితులయ్యారు. ఏప్రిల్‌ 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్టు డీఎన్‌పీఏ ప్రకటించింది. గతేడాది జనవరి నుంచి 2022 మార్చి వరకు డీఎన్‌పీఏ ఛైర్మన్‌గా వ్యవహరించిన డీబీ కార్ప్‌ డిప్యూటీ ఎండీ పవన్‌ అగర్వాల్‌ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో తన్మయ్‌ మహేశ్వరి నియమితులయ్యారు. మనోరమ ఆన్‌లైన్‌ సీఈవో మరియం మాథ్యూ వైస్‌ ఛైర్మన్‌గా.. ఎన్డీటీవీ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ అరిజిత్‌ ఛటర్జీ కోశాధికారిగా నియమించినట్టు డీఎన్‌పీఏ తెలిపింది.

డీఎన్‌పీఏలో దేశంలోని ప్రింట్‌, టెలివిజన్‌ రంగాల్లో ప్రముఖ మీడియా సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. దేశంలో డిజిటల్‌ న్యూస్‌ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంతో పాటు మెరుగైన భవిష్యత్తును సృష్టించే సంకల్పంతో 2019 నవంబర్‌లో డీఎన్‌పీఏ ఏర్పాటైంది. ఆన్‌లైన్ వార్తల మార్కెట్లో తమ గుత్తాధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగపరుస్తోందని ఆరోపిస్తూ సీసీఐలో డీఎన్‌పీఏ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

డీఎన్‌పీఏలో సభ్య సంస్థలివే.
1.టీవీ టుడే నెట్‌ వర్క్‌ లిమిటెడ్‌, 2. అమర్‌ ఉజాలా పబ్లికేషన్స్‌ లిమిటెడ్‌, 3. డి.బి.కార్ప్‌ లిమిటెడ్‌, 4. టైమ్స్‌ ఇంటర్నెట్ లిమిటెడ్‌, 5. ఐఈ ఆన్‌లైన్‌ మీడియా సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌), 6. ద మలయాళం మనోరమ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, 7.జాగరణ్‌ న్యూ మీడియా, 8. ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈనాడు) 9. లోక్‌మత్‌, 10.హెచ్‌టీ డిజిటల్‌ స్ట్రీమ్స్‌ లిమిటెడ్‌, 11.ఏబీపీ, 12.ఎన్‌డీటీవీ, 13. ద న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌, 14. జీ మీడియా కార్పొరేషన్‌ లిమిటెడ్‌, 15. మాతృభూమి ప్రింటింగ్ అండ్‌ పబ్లిషింగ్‌ కంపెనీ, 16.ది హిందూ


Source: Eenadu